Header Banner

BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్! తక్కువ ధర ఎక్కువ లాభం...! వివరాలు మీకోసం!

  Thu Feb 27, 2025 21:56        Business

ఇటీవల ఫోన్ రీఛార్జీ ధరలను విపరీతంగా పెంచేశాయి అన్ని ప్రైవేట్ టెలికాం సంస్థలు. ఇదే సదవకాశంగా తీసుకుని కస్టమర్లను ఆకర్షించేందుకు అత్యంత చౌక ధరకే సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది BSNL. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్ ప్రకటనతో జియో, ఎయిర్‌టెల్, వీఐలకు భారీ ఝలక్ ఇచ్చింది.

ఊరించే ఆఫర్లతో అతి తక్కువ సమయంలోనే దిగ్గజ టెలికాం ఆపరేటర్‌గా అవతరించిన జియో.. గతేడాది మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచడంతో యూజర్లు ఆగ్రహంతో ఉన్నారు. ఎయిర్‌టెల్, వీఐలు అదే బాటలో నడిచాయి. ఇప్పటికే చాలా మంది యూజర్లు BSNL నెట్‍‌వర్క్‌కు మారారు. ఇదే అదనుగా తాజాగా ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఆ ప్లాన్ వివరాలివి..

 

ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రూ. 197 ప్లాన్.. 70 రోజుల వ్యాలిడిటీ..

ప్రైవేట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు రీఛార్జీ ధరలు విపరీతంగా పెంచుతున్న నేపథ్యంలో.. మొబైల్ వినియోగదారులు తక్కువ ధరకే దీర్ఘకాలిక వ్యాలిడిటీ అందించే ప్లాన్ల కోసం చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా దాదాపు 50 లక్షల మంది కొత్త వినియోగదారులు అసంతృప్తితో BSNLకు మారడంతో టెలికాం సంస్థల మధ్య పోటీ పెరిగింది. సరిగ్గా ఇదే వేళలో ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.200లకే 70 రోజుల వ్యాలిడిటీ ప్రకటించి జియో, ఎయిర్‌టెల్ మరియు Viలకు భారీ షాకిచ్చింది.

 

BSNL రూ. 197 ప్లాన్ పూర్తి వివరాలు..

BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్‌ ధర రూ. 197. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులు. తమ నంబర్‌ను ఎక్కువ కాలం పాటు యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి.. ఎక్కువ డేటా లేదా కాలింగ్ అవసరం లేని వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్. కానీ OTP ధృవీకరణ వంటి ముఖ్యమైన సేవలకు యాక్టివ్ సిమ్ అవసరం.

 

అపరిమిత కాలింగ్: వినియోగదారులు మొదటి 18 రోజులు అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత ఉచిత కాల్‌లను పొందుతారు. ఆ తర్వాత, అవుట్‌గోయింగ్ కాల్స్ నిలిపివేయబడతాయి, కానీ ఇన్‌కమింగ్ సేవలు పూర్తి 70 రోజులు యాక్టివ్‌గా ఉంటాయి.

డేటా ప్రయోజనాలు: ఈ ప్లాన్ మొత్తం 36GB డేటాను అందిస్తుంది. మొదటి 18 రోజులు రోజువారీ పరిమితి 2GB. ఆ తర్వాత వినియోగదారులకు డేటా సేవలు నిలిపివేయబడతాయి. కాబట్టి, డేటా కావాలంటే మీ నంబర్‌కు అదనపు టాప్-అప్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఉచిత SMS: BSNL ఈ ప్లాన్ యొక్క మొదటి 18 రోజులకు రోజుకు 100 ఉచిత SMSలను కూడా అందిస్తుంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలుమార్గదర్శకాలు ఇవే!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Business news #Businesss #Latest News #Telugu News #Jio annual plans #Airtel 5G #BSNL #Trending